దేశంలోనే అత్యున్నత సర్వీసులైన IAS, IPSల నియామక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ వాయిదా పడుతయాయని కొన్ని రోజులుగా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో అభ్యర్థుల్లో అయోమయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో యూపీఎస్సీ అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది. పరీక్ష వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్ పెట్టింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 7 (జనవరి 7) నుంచి యథావిధిగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సూచించింది.
కరోనా నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది యూపీఎస్సీ. ఎగ్జామ్ సెంటర్స్ లలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంకా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేలా తగు రవాణా సదుపాయాలు చేయాలని యూపీఎస్సీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.
పరీక్ష నిర్వహణకు గానూ.. జిల్లా విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల సూపర్వైజర్లకు యూపీఎస్సీ పలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులతో పాటు నిర్వాహకులు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని యూపీఎస్సీ తన మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఎగ్జామ్ సెంటర్లలో మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
ఇంకా కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని యూపీఎస్సీ సూచించింది. మరో వైపు అభ్యర్థులు సైతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సివిల్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అయితే యూపీఎస్సీ తాజా ప్రకటనతో ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం లేదని స్పష్టమైంది. ఈ నెల 7, 8, 9, 15, 16 తేదీల్లో సివిల్స్ ఎగ్జామ్ జరగనుంది.
యూపీఎస్సీ (UPSC) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి నిపుణులు ఇస్తున్న సూచనలివే.. సివిల్స్ క్లియర్ చేయడానికి సిలబస్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పుస్తకాలు, సబ్జెక్టుల వారీగా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవసరం. వీలైతే సివిల్స్ క్లియర్ చేసిన వారి సలహాలు, గైడెన్స్ తీసుకోండి. సివిల్స్‌లో కరెంట్ అఫైర్స్ (Current Affairs) కు ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉంటుంది. అందుకే అంతర్జాతీయ, జాతీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
యూపీఎస్సీ సివిస్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి 500 మార్కులు కేటాయించారు. మీ ఆసక్తిని బట్టి సబ్జెట్ ఎంచుకోండి. 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటితో పాటు ఇతర పుస్తకాలనూ చదవండి. చిన్న నోట్స్ తయారు చేసుకోండి. రివిజన్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)