విద్యార్హత: అభ్యర్థులు బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పశుసంవర్ధక, వెటర్నరీ సైన్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టులలో కనీసం ఒకదానిలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయం, అటవీ శాస్త్రం లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
* రిజిస్టర్ చేసుకోవడం ఎలా? : సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023కి అప్లై చేయాలంటే అభ్యర్థులు ముందుగా UPSC అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ఓపెన్ చేయాలి. అక్కడ హోమ్ పేజీలో 'OTR ఫర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ UPSC అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్’ లింక్‌పై క్లిక్ చేయాలి. కొత్తగా ఓపెన్ అయిన వెబ్‌పేజీలో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఫారం పూర్తి చేయాలి.
* ఏడేళ్లలో అత్యధిక పోస్టులు : ఈసారి రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా అత్యధికంగా 1105 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమీషన్ నోటిఫై చేసింది. గత ఏడేళ్లలో ఇవే అత్యధిక పోస్టులు కావడం గమనార్హం. గతేడాది 1011 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 2016లో చివరిసారిగా 1000కు పైగా పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగింది. 2017లో 980, 2018లో 782, 2019లో 896, 2020లో 796 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.