డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై యూజీసీ ప్రకటన.. క్లాసులు ఎప్పటి నుంచంటే..

డిగ్రీ, పీజీ కాలేజీల ప్రారంభంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) మంగళవారం ప్రకటించింది. నవంబరు 1 నుంచి తరగతులను నిర్వహించాలని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది.