1. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జూనియర్ లైన్మెన్-JLM, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-JACO, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-JPO పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆసక్తిగల అభ్యర్థులు tssouthernpower.com లేదా tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. జేపీఓ, జేఎల్ఎం పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు అక్టోబర్ 31న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇక విద్యార్హతల వివరాలు చూస్తే జూనియర్ లైన్మెన్ పోస్టుకు 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ పాస్ కావాలి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుకు బీఏ, బీకామ్, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)