TSRJC CET 2020 APPLICATION DEADLINE ENDS ON JULY 10 FOR ADMISSIONS IN TELANGANA GURUKUL COLLEGES SS
TSRJC CET 2020: గురుకుల కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్స్... 2 రోజులే గడువు
TSRJC CET 2020 | పదవ తరగతి పాసయ్యారా? ఇంటర్లో జాయిన్ కావాలనుకుంటున్నారా? తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
1. తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు శుభవార్త. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గడువును పెంచింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ-TREIS. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 పేరుతో ఈ పరీక్ష జరగనుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ మే 10న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. పరీక్ష వాయిదా వేయడంతో దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది సొసైటీ. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది TREIS. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)