తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తాజాగా నిరుద్యోగులకు కీలక సూచన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలపై సర్వీస్ కమిషన్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. ఈ మేరకు TSPSC కార్యదర్శి వాణీ ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
అత్యంత పారదర్శకంగా TSPSC ద్వారా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని స్పష్టం చేశారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వారిని నమ్మి మోసపోవద్దని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇలాంటి చర్యలకు పాల్పడిన వారితో పాటు, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందాలని ప్రయత్నించిన అభ్యర్థులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అలాంటి అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటామని వాణీ ప్రసాద్ స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడే వారి సమాచారాన్ని vigilance@tspsc.gov.in కు మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఇలా మెయిల్ ద్వారా మోసగాళ్ల సమాచారాన్ని అందించిన వారికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని వాణీ ప్రసాద్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)