1. తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 833 పోస్టులతో మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్పీఎస్సీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 833 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్)- 62, అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)- 41, అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)- 13, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)- 29 పోస్టులున్నాయి. (image: TSPSC Notification)
4. వీటితో పాటు టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)- 09, అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)- 03, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్)- 12, అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)- 38, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్మెంట్)- 142, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్మెంట్)- 35 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్మెంట్)- 50, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)- 27, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)- 68, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)- 31, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్ HOD)- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్)- 147, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్)- 65, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)- 53, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ HOD)- 07 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. వేర్వేరు పోస్టులకు వేర్వేరు పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజీరింగ్లో బీఈ లేదా బీటెక్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కు 3 ఏళ్లు, ఎన్సీసీ సేవలు అందించినవారికి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. దరఖాస్తు ఫీజు వివరాలు చూస్తే రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు + రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. వేతనాల వివరాలు చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.45,960 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,24,150. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.32,810 బేసిక్ వేతనంతో మొత్తం రూ.96,890. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Application for the post of AE (16/2022) లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ వన్ టైన్ రిజిస్ట్రేషన్ వివరాలన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయి. వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)