తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా.. తాజాగా సంచలన విషయాలను సిట్ అధికారులు బయట పెట్టారు. టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తెలుస్తోంది. అంతే కాకుండా.. అంతే కాకుండా.. ఏఈ పరీక్ష జరుగుతున్న సమయంలో ప్రవీణ్ స్వ్కాడ్ గా వెళ్లినట్లు తెలుస్తోంది. స్క్వాడ్ గా వెళ్లి ఓ మహిళకు ఏఈ పరీక్ష కీ ఇచ్చినట్లు గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
టీఎస్ పీఎస్సీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా.. ఈ కేసులో పలువురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు కొనసాగించిన అనంతరం పోలీసులు ఒక మహిళతో పాటు 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)