తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 503 ఖాళీలతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన ప్రలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించారు. ఈ నెల 15న ఇందుకు సంబంధించిన ప్రైమరీ, ఫైనల్ కీని సైతం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కీలో కొన్ని ప్రశ్నలను తొలగించింది టీఎస్పీఎస్సీ.
జాబితాను విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులు టీఎస్సీఎస్సీ వెబ్ సైట్లో ఐడీ, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి అడ్మిట్ కార్డు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా.. ప్రత్యేకంగా క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉంచే అవకాశం లేదని సమాచారం.
హైకోర్టు తీర్పు రాగానే ఇందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్-1 పరీక్ష దరఖాస్తులు ప్రారంభమైన నాటి నుంచి కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది టీఎఎస్పీఎస్సీ. ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్షను నిర్వహించిన టీఎస్పీఎస్సీ విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంది.