ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో గ్రూప్-4 పోస్టులపై ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అదనపు పోస్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. అవసరమైతే కొందరికి ప్రమోషన్లు ఇచ్చైనా సరే.. పోస్టుల సంఖ్య పెంచాలని హెచ్వోడీలు ఆదేశించారు.(ప్రతీకాత్మక చిత్రం)
అదనపు పోస్టులపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి గ్రూప్-4 నోటిఫికేషన్ను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కానీ ఆ టైమ్కల్లా నోటిఫికేషన్ రాకపోవచ్చని.. జూన్ 15 తర్వాతే విడుదల చేసే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)