తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మొత్తం 503 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన ఏడేళ్ల తర్వాత విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపరేషన్ లో మునిగిపోయారు.
అయితే.. గ్రూప్ 1 కోసం మార్కెట్లో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ పుస్తకం చదవాలో అర్థం కాక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నియమించిన సిలబస్ కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.