తెలంగాణలో వరుస జాబ్ నోటిఫికేషన్లలో నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది. టీచర్ జాబ్స్ మినహా.. పోలీస్, జేఎల్, గ్రూప్-1, 2, 3, 4 తదితర అన్ని ప్రధాన నోటిఫికేషన్లన్నీ దాదాపుగా విడుదల కావడంతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్ బాట పట్టారు. అత్యధిక పోస్టులున్న (8,038) గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,55,022 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. తొలివారంలోనే లక్షన్నరకు పైగా దరఖాస్తులు రావడంతో రానున్న రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)