TSPSC Group-4 Applications: రికార్డు దిశగా గ్రూప్-4 దరఖాస్తులు.. ఇప్పటికే ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?
TSPSC Group-4 Applications: రికార్డు దిశగా గ్రూప్-4 దరఖాస్తులు.. ఇప్పటికే ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?
తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇప్పటికే ఈ సంఖ్య 5 లక్షలకు చేరువ కావడం విశేషం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో 8039 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ను డిసెంబర్ 30 నుంచి ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
భారీగా ఉద్యోగాలు ఉండడంతో ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. నిన్న సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య 4,97,056కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దరఖాస్తులకు ఈ నెల 30ని ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే.. గడువు నాటికి దరఖాస్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కనీసం 9 లక్షల సంఖ్య అయినా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే.. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా.. ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కలను పరిశీలిస్తే గ్రూప్-4 కు ప్రతీ రోజు సగటున 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6