లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను డిసెంబర్ 1న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9168 గ్రూప్-4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది తెలంగాణ సర్కార్. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అయితే.. సాంకేతిక కారణాల దృష్ట్యా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ రోజు అంటే డిసెంబర్ 30 నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దరఖాస్తులను ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో దరఖాస్తు గడువును సైతం పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 19 వరకు అవకాశం కల్పించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ రోజు దరఖాస్తుల ప్రారంభం సందర్భంగా టీఎస్పీఎస్సీ అనితా రామచంద్రన్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
దరఖాస్తు తేదీని పొడిగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా సాధ్యమైనంత ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అభ్యర్థులు గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో గ్రూప్-4 రాత పరీక్ష ఉంటుందని టీఎస్ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)