1. తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏప్రిల్‌లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇంకొన్ని రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 503 గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మూడు నెలల తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 90 రోజులు ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 30 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక మెయిన్స్ విషయానికి వస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మెయిన్స్‌కు మధ్య 90 నుంచి 100 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు సమయం ఇచ్చేలా అధికారులు క్యాలెండర్ ప్రిపేర్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పటికే పలు శాఖల నుంచి టీఎస్పీఎస్సీకి ఇండెంట్లు వచ్చాయి. మిగతా శాఖల నుంచి కూడా ఇండెంట్లు రాగానే వాటిని పరిశీలించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. ఇక గ్రూప్ పరీక్షల విషయానికి వస్తే ప్రిలిమ్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పద్ధతిలో ఉంటుంది. మెయిన్స్ డిస్క్రిప్టీవ్ పద్ధతిలో ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారు మెయిన్స్ రాయడానికి అర్హులు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మెయిన్స్ క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ పూర్తైన మూడు నాలుగు నెలల్లో ఫలితాలు వస్తాయి. ఫలితాలు విడుదలైన ఒకట్రెండు నెలల్లోనే ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే ఇంటర్వ్యూల కన్నా ముందే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండొచ్చని భావిస్తున్నారు. 2023 ఆగస్ట్ నాటికి గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. శాఖల వారీగా ఖాళీల వివరాలు చూస్తే డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్-5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-20, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP)-91, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-8, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-2 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. వీటితోపాటు డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్-6, మున్సిపల్ కమిషనర్ Gr.2- 35, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్-121, డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్-5, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్-48, డిప్యూటీ కలెక్టర్-42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్-26, డిస్ట్రిక్ట్ రిజిస్టార్-5, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3, రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్-4, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)