ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు వారు స్థానికులా? స్థానికేతరులా? అని స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం బోనఫైడ్స్ సమర్పించాలి. వీటి కోసమే అభ్యర్థులు తిరుగుతున్నారు. చిన్నప్పుడు తాము చదివిన స్కూల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బోనఫైడ్స్కి సంబంధించి TSPSC క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తులో తెలిపిన వివరాలు వేరుగా ఉంటే చట్టపర చర్యలు తప్పవని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌కు బదులుగా లోకల్ ఏరియా లేదా ఇతర సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారని, అది అపోహేనని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. (ప్రతీకాత్మక చిత్రం)