TSPSC Group-1 Final Key: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎన్ని మార్కులు కలిపే అవకాశం ఉందో తెలుసా? ఇంకా, ఫైనల్ కీ ఎప్పుడంటే?
TSPSC Group-1 Final Key: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎన్ని మార్కులు కలిపే అవకాశం ఉందో తెలుసా? ఇంకా, ఫైనల్ కీ ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ ఎగ్జామ్ కు (TSPSC Group-1 Key) సంబంధించిన కీపై అభ్యంతరాల స్వీకరణ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కీపై వచ్చిన అభ్యంతరాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను గత నెల 16న నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ కీని గత నెల 29న విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అదే నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించింది. కీపై అభ్యంతరాల స్వీకరణ నిన్న సాయంత్రంతో ముగిసింది. అయితే.. అంతా ఊహించినట్లుగా కీపై పెద్దగా అభ్యంతరాలు రాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
దీంతో టీఎస్పీఎస్సీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. శుక్రవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి కేవలం ఐదారు ప్రశ్నలుకు సంబంధించిన సమాధానాలపై మాత్రమే అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఇందులోనూ ఒకే ప్రశ్నకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసునేందుకు ఎక్స్ పర్ట్స్ తో కమిటీని ఈ రోజు లేదా రేపు ఏర్పాటు చేయనుంది టీఎస్పీఎస్సీ. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఆ కమిటీ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సీ అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోనుంది. కమిటీ నివేదిక ప్రకారం.. ఫైనల్ కీని విడుదల చేయనుంది. ఇందుకు కనీసం వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఫైనల్ కీ తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే.. ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన ప్రశ్నకు సంబంధించి అభ్యర్థులందరికీ ఒక మార్కు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అోయితే.. ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదిక ఆధారంగానే ఈ అంశంపై టీఎస్పీఎస్సీ తుది నిర్ణయం తీసుకోనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఇదిలా ఉంటే.. మొత్తం 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విడుదలైన తొలి గ్రూప్-1 (TSPSC Group-1) నోటిఫికేషన్ ఇదే కావడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
మొత్తం 503 ఖాళీలకు గాను 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు 2,86,031 మంది మాత్రమే హాజరయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)