తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 503 ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభించారు అధికారులు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల చివరన అంటే మే 31న ముగియనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ప్రిలిమినరి ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 1,05,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఓటీఆర్ మార్పులు చేసుకున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 2,28,088 మంది ఓటీఆర్‌లో మార్పులు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్తగా చేసుకున్న వారి విషయానికి వస్తే ఇప్పటి వరకు 1,08,423 మంది కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆఖరి తేదీ నాటికి గ్రూప్ 1 దరఖాస్తుల సంఖ్య కనీసం 3 లక్షలు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రూప్ 1 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బోనఫైడ్ సర్టిఫికేట్లు పొందడం పెద్ద తలనొప్పిగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
అనేక స్కూళ్లు కరోనాతో పాటు వివిధ కారణాలతో మూతపడడంతో ఆయా అభ్యర్థులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గ్రూప్-1లో లోకల్ స్టేటస్ కోసం 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి. దీంతో మూతబడిన స్కూళ్లలో చదివిన వారు ఆయా సర్టిఫికేట్లు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)