తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తులకు రేపు అంటే మే 26 లాస్ట్ డేట్. దరఖాస్తులకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇంటర్ నెట్ సెంటర్లకు బారులుదీరుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి రేపు రాత్రి 10 గంటల వరకే అవకాశం ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇప్పటికే స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది అభ్యర్థులకు ఆధార్ కార్డులో ఒక విధంగా, టెన్త్ మెమోల్లో మరో విధంగా వివరాలు ఉంటాయి. దీంతో అభ్యర్థులు ఏ వివరాలను దరఖాస్తు చేసుకునే సమయంలో నమోదు చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అభ్యర్థులు టెన్త్ మెమోల్లో ఉన్న వివరాలనే ప్రమాణికంగా తీసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
టెన్త్ మెమోల్లో ఉన్నట్లుగానే వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంకా దరఖాస్తు చేసుకునే సమయంలో వయస్సు తదితర తప్పుగా నమోదు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
నోటిఫికేషన్ ప్రకారం.. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20నే ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే.. ఆ రోజు చాలా మంది అభ్యర్థులు ఒకే సారి దరఖాస్తుకు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయ్యి సాంకేతిక ఇబ్బందులు తలెత్తి వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. అయితే.. ఆఖరి నిమిషయంలో దరఖాస్తు గడువును మరో ఆరు రోజుల పాటు పొడిగించడంతో ఆయా అభ్యర్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. రేపు కూడా అదే సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు రేపు ఉదయంలోగానే దరఖాస్తు పూర్తి చేసుకుంటే టెన్షన్ ఉండదు. కుదరకపోతే మధ్యాహ్నం వరకైనా దరఖాస్తు చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా సెల్ ఫోన్లలో దరఖాస్తు చేసుకోవద్దని ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో మొత్తం 17, 291 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు సంబంధించి గత 20 వ తేదీ వరరకు 5.2 లక్షల మంది అభ్యర్థులు 9.33 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఫోస్టులకు అప్లై చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి ఆ తేదీలోగా 2.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. వయోపరిమితిని పొడిగించడం, దరఖాస్తు చేసుకోవడానికి మరో 6 రోజుల పాటు అవకాశం కల్పించడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంచనా వేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసన అనంతరం మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు సంబంధించిన ఖచ్చితమైన లెక్కలను బోర్డు వెల్లడిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)