తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఈ మేరకు నోటిఫికేషన్లను సైతం విడుదల చేస్తోంది. తాజాగా 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 2వ తేదీన ప్రారంభించింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మొదటగా ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు.
అయితే.. వయోపరిమితిని ప్రభుత్వం మరో రెండళ్లను పెంచడంతో దరఖాస్తుకు ఆఖరి తేదీని ఈ నెల 26కు పొడిగించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాత్రి 10 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. మొత్తం 17, 516 ఖాళీల భర్తీకి ఈ రోజు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇందులో పోలీస్ జాబ్స్ కు సంబంధించి 16,614 ఖాళీలు ఉన్నాయి ఉన్నాయి.
ఇందులో ఎస్ఐ జాబ్స్ కు సంబంధించి 587 ఖాళీలు ఉండగా.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 16027 ఖాళీలు ఉన్నాయి. ఇందులో విభాగాల వారీగా ఖాళీల వివరాలను అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి
మొత్తం 617 ఖాళీలు ఉన్నాయి. ఇంకా డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆయా ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ఈ రోజే. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 10 గంటలలోగా తమ దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు గడువును ఒక సారి పొడిగించిన నేపథ్యంలో మరోసారి దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం లేదు.
అభ్యర్థులు https://www.tslprb.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ ను చూడడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట నిర్ణయించిన విధంగా ఈ నెల 20న దరఖాస్తుకు ఆఖరి తేదీగా నిర్ణయించడంతో ఆరోజు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో సర్వర్ డౌన్ కావడంతో వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. దీంతో అభ్యర్థులు టెన్షన్ పడ్డారు. ఈ రోజు కూడా సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఆ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.