తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తులకు ఈ రోజు అంటే మే 20 లాస్ట్ డేట్. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. పోలీస్ జాబ్స్ కు సంబంధించిన వయో పరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. దరఖాస్తు గడువు పెంపుపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో చివరి నిమిషం వరకు కూడా భారీగా దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే.. ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్న వారు హడావుడిలో అనేక తప్పులు చేసే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)

అలాంటి అభ్యర్థులకు బోర్డు క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులు టెన్త్ మెమోల్లోని వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. టెన్త్ మెమోల్లో ఉన్నట్లుగా వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దరఖాస్తు దారులు ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో మొత్తం 17, 291 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు సంబంధించి మొత్తం 5.2 లక్షల మంది అభ్యర్థులు 9.33 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఫోస్టులకు అప్లై చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటి వరకు 2.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు కూడా పెంచుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కూడా అభ్యర్థులు ఈ ప్రచారాన్ని నమ్మకపోవడం చాలా మంచిది. ఈ అంశంపై సాయంత్రం లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)