తెలంగాణలో పోలీస్ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తులకు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పోలీస్, జైళ్ల శాఖ, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, రవాణా శాఖల్లో కలిపి మొత్తం 17,291 ఖాళీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.