దరఖాస్తుల తర్వాత పరీక్షల నిర్వహణపై రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) దృష్టిసారించనుంది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఎస్ఐ, కానిస్టేబుల్ రాతపరీక్షలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించేందుకు TSLPRB సన్నాహలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆగస్టు 21 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. అనుకోని అవాంతరాలు ఎదురుకాకపోతే.. ఈ తేదీల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకవేళ ఆరోజుల్లో TSPSCకి సంబంధించి ఏవైనా పరీక్షలు ఉంటే.. స్వల్ప మార్పులు చేయవచ్చు. కానీ దాదాపు ఇవే తేదీల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో ఈసారి పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16,614 పోస్టులకు ఇటీవలే టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 587 ఎస్సై పోస్టులు, 16,027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటికి మంగళవారం సాయంత్రం వరకు సుమారు 12.1 లక్షల దరఖాస్తులొచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2018లో కూడా భారీ మొత్తంలో పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈసారి అంతకు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అప్పుడు కేవలం పోలీసుల నియామకాలే జరిగాయి. కానీ ఈసారి టీఎస్పీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో.. చాలా మంది అటు వైపు దృష్టిసారిస్తారని అధికారులు అనుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)