1. తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్- TSLPRB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభిస్తోంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 151 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 ఆగస్ట్ 29 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్- TSLPRB అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లో విడుదలైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఇతర పద్ధతుల ద్వారా దరఖాస్తులు పంపిస్తే స్వీకరించరు. అభ్యర్థులు ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు సబ్మిట్ చేస్తే దరఖాస్తులన్నీ రిజెక్ట్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థుల వయస్సు 2021 జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు ఉండాలి. క్రిమినల్ కోర్టుల్లో అడ్వకేట్‌గా కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. వేతనాల వివరాలు చూస్తే రూ.54,220 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,33,630 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎస్ఎస్సీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. వీటితో పాటు అడ్వకేట్‌గా తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా ఇతర రాష్ట్రాల బార్ కౌన్సిల్ జారీ చేసిన సర్టిఫికెట్ అఫ్లోడ్ చేయాలి. మూడేళ్లుగా క్రిమినల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)