తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సోమవారం తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ తో పాటు ఈ-సెట్, ఐ-సెట్, పీజీ సెట్, ఎడ్ సెట్ షెడ్యూళ్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఎంసెట్ షెడ్యూల్ విడుదలైన తర్వాత పరీక్షకు 45 రోజుల గడువు ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఎగ్జామ్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
ఈ సారి ఎంసెట్ ర్యాంకింగ్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వకూడదన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)