1. టెట్-2022 రాసే అభ్యర్థులు కొన్ని రూల్స్ గుర్తుంచుకొని పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు Candidate ID, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి టెట్ హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థుల ఫొటో, సంతకం హాల్ టికెట్ పై లేకుంటే అటెస్టేషన్ తప్పనిసరి అని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. అనంతరం ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (DEO)ను సంప్రదించాలన్నారు. డీఈవో పరిశీలన అనంతరం అభ్యర్థులను టెట్ ఎగ్జామ్ ను రాయడానికి అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా అభ్యర్థుల పేరు, తల్లి, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, పీహెచ్సీ తదితర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే.. ఎగ్జామ్ సెంటర్లో నామినల్‌రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుందని టెట్ కన్వీనర్ రాధారెడ్డి స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. టెట్ ఎగ్జామ్ పేపర్ 1 ఉదయం 9.30 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. -ఉదయం పరీక్షకు 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనమతించేది లేదని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)