1. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జరగనుంది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, మేలోనే టెట్ నిర్వహించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. టెట్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించడంతో టెట్ షెడ్యూల్ సిద్ధం చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉన్నట్టుగానే ఈసారి కూడా టెట్ సిలబస్ ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మే మూడో వారం లేదా నాలుగో వారంలో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 పరీక్షల్ని ఒకే రోజు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 నిర్వహిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్, పరీక్ష తేదీ లాంటి వివరాలతో డీటెయిల్డ్ నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈసారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ విద్యార్థులు పోటీ పడే అవకాశం కల్పించబోతున్నారు. అంతేకాదు... టెట్ సర్టిఫికెట్ వేలిడిటీ లైఫ్‌టైమ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా జీవోలో, నోటిఫికేషన్లో మార్పులు కనిపించనున్నాయి. ఈసారి టెట్ పరీక్షకు 3 లక్షల అభ్యర్థులు హాజరవుతారని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాలేదు. టెట్ కూడా నిర్వహించలేదు. టీచర్ పోస్టులపై ఆశలతో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో భారీగా విద్యార్థులు చేరారు. దీంతో ఈసారి పోటీ ఎక్కువగా ఉంటుందని అంచనా. మరోవైపు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి కూడా అవకాశం ఇస్తే పోటీ ఇంకా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రస్తుతం బీఈడీ, డీఈడీ కోర్సులు పాసైనవారు, బీఈడీ, డీఈడీ కోర్సులు చదువుతున్నవారు టెట్ నోటిఫికేషన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టెట్ క్వాలిఫై అయినవారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. డీఈడీ పాసైనవారు టెట్ పేపర్ 1, బీఈడీ పాసైనవారు టెట్ పేపర్ 1, పేపర్ 2 రాసే అవకాశం కల్పించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 80,039 పోస్టుల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 7,878 పోస్టులు ఉన్నాయి. అంటే 20,964 పోస్టులు భర్తీ కానున్నాయి. అవసరమైతే మరో 10,000 పోస్టుల్ని కూడా భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే టీచర్ ఉద్యోగాలు కోరుకునేవారికి అవకాశాలు పెరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇప్పటివరకు ప్రకటించిన పోస్టుల్లో 6,500 పోస్టులకు సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు కావడం విశేషం. 2,000 పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 600 వరకు భాషా పండితుల పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)