1. ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు కోరుకుంటున్న అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేయొచ్చు. జూన్ 12న టెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. జూన్ 27న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణ టెట్‌లో రెండు పేపర్స్ ఉంటాయి. టెట్ పేపర్ 1 బీఈడీ, డీఈడీ అభ్యర్థుల కోసం కాగా, టెట్ పేపర్ 2 కేవలం బీఎడ్ అభ్యర్థుల కోసం మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణ టెట్ పేపర్ 2 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పద్ధతిలో జరుగుతుంది. ప్రతీ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ప్రతీ సరైన సమాధానానికి ఒక మార్కు వస్తుంది. నెగిటీవ్ మార్కింగ్ ఉండదు. టెట్ పేపర్ 1 ఒకటో తరగతి నుంచి ఆదో తరగతి వరకు బోధించేవారికి , టెట్ పేపర్ 2 ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారికి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వరకు బోధించాలనుకునేవారు రెండు పేపర్లు రాయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. టెట్ పేపర్ 2 లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్లకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్‌లో, సోషల్ స్టడీ టీచర్లకు సోషల్ స్టడీస్‌లో, ఇతర సబ్జెక్ట్స్ వారికి సంబంధిత సబ్జెక్ట్స్‌లో 60 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. మొత్తం రెండున్నర గంటల సమయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఎక్కువగా ఎడ్యుకేషన్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ పైన ఫోకస్ అయి ఉంటుంది. సెకండరీ స్కూళ్లల్లో స్టేట్ సిలబస్‌తో ఫస్ట్ లాంగ్వేజ్‌లో తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సంస్కృతం భాషలు ఉంటాయి. ఈ 7 భాషల్లో అభ్యర్థి (లాంగ్వేజ్ పండిట్ కాకుండా) ఒక భాషను ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థులు తప్పనిసరిగా ఆ భాషను అధ్యయన మాధ్యమంగా లేదా మొదటి భాషగా కనీసం పదో తరగతి వరకు తప్పనిసరిగా చదివి ఉండాలి. CBSE లేదా ICSE పాఠ్యాంశాలను చదివిన అభ్యర్థులు పదో తరగతి వరకు చదివిన భాషను ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు TS-TET పేపర్-II లాంగ్వేజ్-I కింద సంబంధిత పండిట్ శిక్షణలో వారి అధ్యయన భాషను ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అందరు అభ్యర్థులకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్ విభాగాల వారికి మ్యాథ్స్‌లో 24 ప్రశ్నలు కంటెంట్‌కు సంబంధించినవి, 6 ప్రశ్నలు పెడగాగికి సంబంధించి ఉంటాయి. సైన్స్‌లో 24 ప్రశ్నలు కంటెంట్‌కు సంబంధించినవి, 6 ప్రశ్నలు పెడగాగికి సంబంధించి ఉంటాయి. ఫిజికల్ సైన్స్ కంటెంట్‌కు సంబంధించిన 12 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్ కంటెంట్‌కు సంబంధించిన 12 ప్రశ్నలు, సైన్స్ పెడగాగికి సంబంధించి 6 ప్రశ్నలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పేపర్ 2 సోషల్ స్టడీస్‌లో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనమిక్స్ ప్రశ్నలు ఉంటాయి. 60 ప్రశ్నల్లో 48 ప్రశ్నలు కంటెంట్‌కు సంబంధించినవి, 12 ప్రశ్నలు పెడగాగికి సంబంధించి ఉంటాయి. ఇక మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్‌లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టాపిక్స్ కవర్ అవుతాయి. డిఫికల్టీ స్టాండర్డ్ సీనియర్ సెకండరీ లెవెల్ అంటే 12వ తరగతి వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 లో ప్రశ్నలు నైపుణ్యం ఆధారంగా భాష, భాష యొక్క అంశాలు, కమ్యూనికేషన్, గ్రహణశక్తి సామర్ధ్యాలకు సంబంధించి సీనియర్ సెకండరీ లెవెల్ అంటే 12వ తరగతి స్థాయిలో ఉంటాయి. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tstet.cgg.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)