1. తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరగనుంది. 2022 జూన్ 27న ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఈసారి టెట్ రాయాలంటే ఎలాంటి అర్హతలుండాలి? అర్హతల్లో ఏవైనా మార్పులు ఉన్నాయా? అభ్యర్థుల్లో ఇవే సందేహాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. గతంలో డీఎడ్ పాసైనవారు టెట్ పేపర్ 1, బీఎడ్ పాసైనవారు టెట్ పేపర్ 2 రాసేవారు. కానీ ఈసారి బీఎడ్ అభ్యర్థులు టెట్ పేపర్ 1 కూడా రాయొచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా పోటీ పడొచ్చు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధించేవారి కోసం పేపర్ 1, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించేవారి కోసం పేపర్ 2 నిర్వహిస్తారు. మరి ఈసారి టెట్ రాయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. టెట్ పేపర్ 1 అర్హతలు చూస్తే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 45 శాతం మార్కులతో పాసైతే చాలు. దీంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed.) లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. టెట్ పేపర్ 1 కోసం 2015 డిసెంబర్ 23న గైడ్‌లైన్స్ విడుదల కాకముందు చదివినవారికి విద్యార్హతలు వేరుగా ఉన్నాయి. ఆ అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ లేదా తత్సమాన పరీక్ష 45 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 40 శాతం మార్కులతో పాసైతే చాలు. దీంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed.) లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. టెట్ పేపర్ 1 కి గ్రాడ్యుయేషన్ 50 శాతం మార్కులతో పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 45 శాతం మార్కులతో పాసైతే చాలు. దీంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (Special Education) పాస్ కావాలి. ఈ అర్హతలు ఉన్నవారంతా టెట్ పేపర్ 1 రాయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. టెట్ పేపర్ 2 కోసం 2015 డిసెంబర్ 23న గైడ్‌లైన్స్ విడుదల కాకముందు చదివినవారికి విద్యార్హతలు వేరుగా ఉన్నాయి. బీఎ, బీఎస్సీ, బీకామ్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 40 శాతం మార్కులతో పాసైతే చాలు. దీంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (Special Education) పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. టెట్ పేపర్ 2 కి నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్, బీఎస్సీ ఎడ్యుకేషన్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 45 శాతం మార్కులతో పాసైతే చాలు. ఐచ్ఛిక సబ్జెక్టులలో ఒకటిగా సంబంధిత భాషతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్ పాసైనవారు లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ పాసైనవారు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ పూర్తి చేసి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందినవారు లేదా భాషా ఉపాధ్యాయులకు సంబంధించి మెథడాలజీలలో ఒకటిగా సంబంధిత భాష ఎంచుకొని బీఈడీ పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. వీటితో పాటు బీఈ లేదా బీటెక్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (Special Education) చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు 45 శాతం మార్కులతో పాస్ కావాలి. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tstet.cgg.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)