ఈ నెల 12వ తేదీన తెలంగాణలో టెట్ ఎగ్జామ్ (TS TET Exam) ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. టెట్ కీకి సంబంధించి ప్రైమరీకీని (TET Primary Key) ఇప్పటికే విడుదల చేశారు అధికారులు. టెట్ ఎగ్జామ్ కు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ జూన్ 18వ తేదీతో ముగిసింది. అయితే.. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక కీపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పేపర్ 1 (TS TET 2022 Paper 1) కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. టెట్ పేపర్ 2కు ((TS TET 2022 Paper 2) సంబంధించి 4,663 అభ్యంతరాలను అభ్యర్థులు వ్యక్తం చేశారు.ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనున్నారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే టెట్ ఫైనల్ కీని ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. టెట్ ఫైనల్ కీ విడుదల తర్వాత ఈ నెల 27న టెట్ ఫలితాలను విడుదల చేయనుంది విద్యాశాఖ. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న నిర్వహించిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక టెట్ పేపర్ ప్రశ్నల సరళిని పరిశీలిస్తే గతంలో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే ఈ సారి ఈజీగా ఉందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. సిలబస్ లో లేని ప్రశ్నలు వచ్చాయన్న విమర్శలు మాత్రం చాలా మంది అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతోంది. పేపర్ 1లో ఐదు ప్రశ్నలు, పేపర్ 2 లో 2 ప్రశ్నలు సిలబస్ లో లేనివి వచ్చాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. చాలా మంది అభ్యర్థులు ఈ సారి పేపర్ చాలా సువులుగా ఉందని చెబుతుండడంతో ఈ సారి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. టెట్ ఫలితాల అనంతరం టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఖాళీల వివరాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)