తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇటీవల ి ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. విద్యార్థులకు రీవాల్యుయేషన్ చేయించుకోవడంతో పాటు.. ఇంప్రూవ్మెంట్ కు దరఖాస్తు చేసుకోవడానికి సైతం అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డు. అయితే.. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే జులై 6ని ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇంటర్ బోర్డ్. (ప్రతీకాత్మక చిత్రం)
రీవాల్యుయేషన్, సప్లమెంటరీ, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు ముగిసే లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిన్నటి వరకు మొత్తం 17,995 దరఖాస్తులు వచ్చినట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అయితే.. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో మే 26 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరిగాయి. 4.64 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 4.39 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని రాశారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షల్ని నిర్వహించారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి 2022 జూలై 6 వరకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తేదీ పొడిగించే అవకాశం లేదు. రీకౌంటింగ్ కోసం ఒక పేపర్‌కు రూ.100, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)