1. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) జూన్ 28 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై రకరకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మొదట జూన్ 15న ఫలితాలు వస్తాయన్నారు. ఆ తర్వాత జూన్ 25న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలొచ్చాయి. అయితే మూల్యాంకనం పూర్తైన తర్వాత కంప్యూటరీకరణ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇంటర్ బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. జూన్ 28 ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. వీటితో పాటు న్యూస్18 తెలుగు వెబ్సైట్ https://telugu.news18.com/ లో కూడా ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (image: TSBIE)
4. ముందుగా https://telugu.news18.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్, ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఆప్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. విద్యార్థులు తమకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇంటర్ విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in, పరీక్షా ఫలితాల వెబ్‌సైట్స్ https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in లో కూడా ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. వీటిలో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. తెలంగాణలో మే 26 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరిగాయి. 4.64 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 4.39 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని రాశారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్ పరీక్షల్ని నిర్వహించారు అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)