1. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మంగళవారం ఉదయం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఆన్లైన్లో మార్క్స్ మెమోలను జారీ చేస్తోంది. కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పాటు విద్యార్థులు మార్క్స్ మెమోలు డౌన్లోడ్ చేయొచ్చు. 2022 జూన్ 28 సాయంత్రం 5 గంటల నుంచి షార్ట్ మెమో (TS Inter Short Memo) డౌన్లోడ్ చేయొచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించినట్టుగానే అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లో షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఈజీ స్టెప్స్‌తో మార్క్స్ మెమో డౌన్లోడ్ చేయొచ్చు. ఇందుకోసం విద్యార్థులు ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో TSBIE IPE 2022 Mark's Memos పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రిజల్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్, జనరల్, వొకేషనల్, జనరల్ బ్రిడ్జి కోర్స్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులో విద్యార్థులు తమకు చెందిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. Get Memo పైన క్లిక్ చేయాలి. స్క్రీన్‌పైన షార్ట్ మెమో కనిపిస్తుంది. ప్రింట్ తీసుకొని పీడీఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్థులు ఈ మార్క్స్ మెమోను కలర్ కాపీ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రిన్సిపాల్స్ తమ కళాశాల విద్యార్థుల మార్క్స్ మెమోలను కాలేజ్ లాగిన్‌తో డౌన్లోడ్ చేయొచ్చు. కళాశాలలకు కాలేజ్ మార్క్స్ రిజిస్టర్స్ 2022 జూలై 5 నుంచి అందుబాటులో ఉంటాయి. మార్క్స్ మెమో ఫిజికల్ కాపీని వేరుగా ఇవ్వట్లేదని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు తెలియజేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులు 2022 జూన్ 30 నుంచి 2022 జూలై 6 వరకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు తేదీ పొడిగించే అవకాశం లేదు. రీకౌంటింగ్ కోసం ఒక పేపర్‌కు రూ.100, ఆన్సర్ బుక్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించాలి. https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలి. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసే అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)