1. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24న పూర్తయ్యాయి. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లో ఫలితాలు (TS Inter Results 2022) విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది. దీంతో జూన్ 15న ఫలితాలు విడుదలవుతాయని వార్తలొచ్చాయి. అంతకుముందు జూన్ 10న ఫలితాలు విడుదల చేయొచ్చన్న ప్రచారం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 15న ఫలితాలు విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది. జూన్ 20 లోపు ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్ 20 కూడా దాటిపోయింది. జూన్ 25న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయని తాజాగా మళ్లీ వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. జూన్ 25న కూడా ఫలితాలు విడుదలయ్యే సూచనలు లేవు. తెలంగాణ ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తైంది. ఫలితాల కంప్యూటరైజేషన్ జరుగుతోంది. ఎలాంటి తప్పులు లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించి, అంతా సజావుగా ఉన్న తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ అధికారులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణలో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియర్ పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వారంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి కొత్త తేదీ తెరపైకి వస్తుండటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)