TS INTER EXAMS HERE IS THE IMPORTANT DETAILS ABOUT RESULTS AND SUPPLEMENTARY EXAMS DATES NS
Telangana Inter Results: ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్.. మరి రిజల్ట్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results), సప్లిమెంటరీ పరీక్షలపై (Exams) ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ ఈ నెల 24వ తేదీన ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 24వ తేదీలోగా ఫలితాలను విడుదల చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లను 14కు పెంచినట్లు వివరించారు ఆయన. ఈ నెల 8వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పై సైతం బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఫలితాలు విడుదలైన 15 నుంచి 20 రోజుల్లోగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇదిలా ఉంటే.. ఈ రోజు ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు పరీక్షకు 4,64,756 మందికి గాను 4,42,546 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 22,210 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
నిజామాబాద్ జిల్లాలో 1 మాల్ ప్రాక్టిస్ కేసు నమోదటైన్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన మినహా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)