దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఇంటర్ బోర్డు పాలకవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ చైర్మన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైస్ చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డ్ చైర్మన్ నవీన్ మిత్తల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. (మంత్రి సబితారెడ్డి-ఫైల్ ఫొటో)
వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంగ్లిష్ కు సంబంధించి సైతం ప్రాక్టికల్స్ ను నిర్వహించాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థుల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందుకోసం ఇంగ్లిష్ ల్యాబ్ లను కాలేజీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇంకా మాథ్స్ సిలబస్ విషయంలోనూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీసీ విద్యార్థులకు ఉన్నంత కఠినంగా ఎంఈసీ విద్యార్థులకు మాథ్స్ సిలబస్ ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించారు అధికారులు. ఇందుకు తగ్గట్లుగా సిలబస్ లో మార్పులు చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ మూల్యాంకనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సెకండ్ లాంగ్వేజ్ లు అయిన తెలుగు, ఉర్దూ, హిందీ సబ్జెక్టులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఆఫ్ లైన్ లోనూ దీనిని పరీక్షించి లోటుపాట్లు ఉంటే సవరిస్తామన్నారు. వచ్చే ఏఢాది నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)