దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్ రానే వచ్చింది. సాధ్యమైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించాలన్న లక్ష్యంతో సాగుతోన్న ఇంటర్ బోర్డ్ కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 14 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తుండగా.. ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో మూల్యాంకనం పూర్తయింది. (ప్రతీకాత్మక చిత్రం)
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 15న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంటర్ బోర్డ్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిసిన 20 రోజుల్లో వారి ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ సారి ఇంటర్ పరీక్షలు మే 24న ముగిసాయి. అధికారిక సమాచారం ప్రకారం లెక్కన చూసుకున్నా ఈ నెలాఖరులోగాఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షల ఫలితాలు విడుదలైన అనంతరం విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ ఈ లింక్ ద్వారా నేరుగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం కలిపి దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు పరీక్షలకు హాజరయ్యారు.(ప్రతీకాత్మక చిత్రం)
వీరికి సంబంధించిన ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తే త్వరలోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. గతంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో చాలా తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
దీంతో ఫెయిలయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది ప్రభుత్వం. అయితే.. ఈ సారి అలా పాస్ చేసే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ అనేక మార్లు స్పష్టం చేసింది. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ఈ సారి నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)