TS EAMCET 2023: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఎంసెట్ ఎగ్జామ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే
TS EAMCET 2023: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి ఎంసెట్ ఎగ్జామ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే
తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ఈ సారి ఎప్పుడు ఉంటుందోనన్న ఆందోళన లక్షలాది మంది విద్యార్థుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన తాజా అప్టేట్స్ ఇలా ఉన్నాయి.
లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన కీలక అప్డేట్. ఈ పరీక్షను మే నెలలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే.. విద్యార్థులుకు ఇబ్బంది కలగకుండా జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. జేఈఈ కన్నా ముందే ఎంసెట్ తేదీలను ప్రకటిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
రెండు తేదీలు ఒకే సారి వస్తే మళ్లీ ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన తేదీలను మార్చాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఎంసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను జేఈఈ ప్రకటన తర్వాతనే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఎంసెట్ ఎగ్జామ్ ను ఆలస్యంగా నిర్వహించారు. అయితే.. ఈ సారి అనుకున్న సమయానికే స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడంతో సమయానికే ఎంసెట్ నిర్వహణను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇంటర్ లో ఈ సారి వంద శాతం సిలబస్ తో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వడంతో.. ఎంసెట్ లోనూ ఇదే విధానం అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్, ఎంసెట్ కు మధ్య కూడా కొంచెం గ్యాప్ ఉండేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులు తగినంతగా సన్నద్ధం అవుతారని అధికారులు యోచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మరికొన్ని రోజుల్లోనే ఉన్నత విద్యామండలి నుంచి ఎంసెట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రకటన తర్వాత తేదీలపై స్పష్టత రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)