తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఇంకా.. సెప్టెంబర్ 1 లేదా 2న ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కు సంబంధించిన ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ఫలితాల అనంతరం వ్యవసాయ, ఫార్మా(మెడికల్) ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఫలితాలు విడుదలైన ఐదు రోజుల తర్వాత అంటే ఆగస్టు 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ను ప్రారంభించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
కరోనా నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష ఆలస్యమైన విషయం తెలిసిందే. దీంతో కౌన్సెలింగ్ ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అభ్యర్థులు అప్ డేట్ల కోసం https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.