4. పరీక్షల సమయంలో విద్యుత్తుకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎం, ఆశావర్కర్ ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్తు, టాయిలెట్ సౌకర్యాలు ఉండేలా చూడాలని, ముందస్తుగానే తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకొన్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)