2. ముఖ్యంగా ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా సంబంధిత పా ఠశాలలకు పంపామని స్పష్టం చేసింది. ఈ సారి సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపింది. ఈ ఏడాది పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామంది. జనరల్ సైన్స్ కేటగిరీలో మాత్రం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్‌లను ఎక్కువగా ఇవ్వనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్ష తీరును పరిశీలిస్తాయి. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యా శాఖ కోరింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. పరీక్ష కేంద్రంలో సంబంధిత జిల్లా, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఉదయం 9.35 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)