కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయ్యారు. పదో తరగతి పాస్ అయితే అయ్యారు కానీ.. ఇందులో మార్కులే.. విద్యార్థుల భవిష్యత్తుకు చాలా కీకలం అవుతాయి. దీంతో తమకు మార్కులు ఎన్ని కేటాయిస్తున్నారు.? ఎలా కేటాయిస్తున్నారు అన్నదానిపై ఇటు విద్యార్థుల్లో.. అటు తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది..