ఈ పథక ప్రయోజనం కొరకు ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం, తల్లి లేదా కుమార్తె బ్యాంక్ ఖాతా, అడ్రస్ కు సంబంధించిన ప్రూఫ్ అవసరం అవుతాయి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె 18వ పుట్టినరోజున ఆమె అవివాహితురాలు అని గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ నుండి సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత, మెచ్యూర్డ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అమలు చేసే ఏజెన్సీ బ్యాంకు లేదా పోస్టాఫీసు అధికారులకు అధికారం ఇస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్కాలర్షిప్ ఎలా వస్తుందంటే.. 1-3వ తరగతి వరకు ఏడాదికి రూ.300 , 4వ తరగతిలో రూ.500 అందుతాయి. ఐదో తరగతిలో ప్రవేశం పొందితే రూ.600 అదుతుంది. 6-7 తరగతులకు రూ.700, 8లో రూ.800 అందుతాయి. 9-10 తరగతిలో ఆడపిల్లకు రూ.1000 స్కాలర్షిప్ అందజేస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)