అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లొమా కోర్సు బెస్ట్ ఆప్షన్‌గా పరిగణించబడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లొమా కోర్సు విద్యార్థులకు కంప్యూటర్లలో సేవ్ చేయబడిన డేటాతో పాటు అనేక ఇతర ముఖ్యమైన డేటా సంబంధిత సమాచారాన్ని ఎలా భద్రపరచాలనే దానిపై పూర్తి సాంకేతికతలను అందిస్తుంది. ఈ డిప్లొమా కోర్సు తర్వాత సంవత్సరానికి రూ. 12 నుండి రూ.15 లక్షలు సంపాదించవచ్చు. కానీ ఈ డిప్లొమాతో ఉద్యోగం సాధించిన ప్రారంభంలో ప్యాకేజీ అనేది తక్కువగా ఉండవచ్చు.
గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు
బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ డిజైనింగ్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ రంగంలో కెరీర్ ఎంపిక చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేయవచ్చు. గ్రాఫిక్స్ డిజైనింగ్ కింద అనేక రకాల కోర్సులు చేయవచ్చు. ఈ రంగంలో ప్రారంభ వార్షిక ఆదాయం రూ. 4 లక్షల నుంచి నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుంది.
మీరు మొబైల్ యాప్ డెవలపర్‌గా పని చేయాలనుకుంటే 12వ తరగతి పాసైన తర్వాత మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో డిప్లొమా కోర్సు చేయవచ్చు. మొబైల్ అప్లికేషన్ డెవలపర్లు మొబైల్ ఫోన్ల కోసం మాత్రమే కాకుండా టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు , కంప్యూటర్ల కోసం కూడా అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి పని చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కోర్సును వివిధ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ కళాశాలలు కూడా అందిస్తున్నాయి. ఐటీ రంగానికి సంబంధించిన మూడు ముఖ్యమైన కోర్సులు ఇవి. వివిధ విశ్వవిద్యాలయాలు లేదా ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు అనేది భిన్నంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థోమతను బట్టి మీరు ఏ కోర్సులో చేరతారో ఆలోచించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)