సౌత్ ఏసియన్ దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సగటు జీతం ఈసంవత్సరం 9.8శాతం పెరగనుండగా..అదే యావరేజ్ శాలరీ గతేడాది 9.4శాతం ఉందని కార్న్ ఫెర్రీ తన నివేదికలో తెలిపింది. జీతాలు భారీగా పెరిగే అవకాశమున్న లైఫ్ సైన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు చెందిన ఉద్యోగులకు యావరేజ్ 10శాతం పెరుగుతున్నట్లుగా నివేదిక తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏసియా దేశాల్లో సుమారు 60శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నట్లుగా కార్న్ ఫెర్రీ పేర్కొంది. టైర్ వన్ నగరాలుగా పిలవబడే మెట్రోపాలిటన్ కేంద్రాల్లో ఉద్యోగులు మ్యాగ్జిమమ్ జీతం పొందుతున్నట్లుగా కార్న్ ఫెర్రీ పేర్కొంది. హైబ్రీడ్, రిమోట్ వర్కింగ్ వంటి కొత్త వర్క్ కల్చర్ అందుబాటులోకి రావడంతో చాలా సంస్థలు ఉద్యోగస్తులతో ఇంటి దగ్గర నుంచే పని చేయించుకుంటున్నాయి.(ప్రతీకాత్మకచిత్రం)