ఈ తేదీ యొక్క ప్రత్యేకత కేవలం నెహ్రూ జయంతి అని మాత్రమే కాదు.. పిల్లల హక్కులు, వారి సంరక్షణ, వారి చదువుకు సంబంధించి పిల్లలతో పాటూ సమాజాన్ని చైతన్య పరచడం. చదువుమానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్చించడం, ఆడపిల్లల హాజరును పెంచడం... ఇవన్నీ బాలల దినోత్సవం ముఖ్యోద్ధాశాలే. పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు, వేడుకలతో అంగరంగ వైభవంగా బాలల దినోత్సవం జరుపుకుంటుంటాం.
అయితే బాలల దినోత్సవం సందర్భంగా.. ప్రఖ్యాత రచయిత్రి, రిషి సునక్ ( UK ప్రధాన మంత్రి) యొక్క అత్తగారు సుధామూర్తి రాసిన 4 ప్రసిద్ధ శీర్షికల సేకరణను ఆడిబుల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఆడిబుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అద్భుతమైన కథనాలను వింటూ మీ పిల్లలతో కొంత సమయాన్ని ఆస్వాదించండి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. సముద్రం ఎలా ఉప్పగా మారింది.. దీనిని సుధా మూర్తి రచించారు. వ్యాఖ్యాతగా నేహా ఫరాజ్, సుమిత్ కృతార్థ్ వ్యవహరించారు. కథ విషయానికి వస్తే.. చాలా కాలం క్రితం సముద్రపు నీరు తియ్యగా ఉండేది. తర్వాత అది ఉప్పుగా మారింది. ఇది ఎలా జరిగింది..? ఆడియోబుక్లో సముద్రపు నీరు ఉప్పగా మారే విశేషమైన కథను వివరించింది. మీరు సుధా మూర్తి రచించిన కథల ప్రపంచానికి కొత్తవారైతే.. దీనిని ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం. ఆ కథను వినడానికి ఈ లింక్ పై https://www.audible.in/ క్లిక్ చేయండి.
2. అమ్మమ్మ కథలు.. రచించిన వారు సుధామూర్తి. పూనమ్ శ్రీవాస్తవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అమమ్మ చెప్పే కథలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? ఇలాంటి కథలను నైతికతతో సరళమైన, స్పష్టమైన భాషలో వివరించబడిన కథల సమూహంతో అత్యధికంగా అమ్ముడైన ఈ ఆడియోబుక్ను వినండి. చిన్న పిల్లలకు అండ్ ఐదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఈ కథలు మంచి అనుభూతిని మిగుల్చుతాయి. ఆ కథను వినడానికి ఈ లింక్ పై https://www.audible.in/ క్లిక్ చేయండి.
3. తాతామామల కథలు.. రచించిన వారు సుధామూర్తి. పూనమ్ శ్రీవాస్తవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు మహమ్మారి ప్రారంభ రోజులలో.. అందరూ ఇంట్లోనే ఉన్నారు. చాలా వరకు టైం పాస్ కు అమమ్మలు, తాతలు, మామల దగ్గర చిన్న పిల్లలు కథలను వినేవారు. ఆ కథల్లో దేవతలు, రాజులు, యువరాణులు, సర్పాలు, మాయా బీన్స్టాక్స్, దొంగలు, రాజ్యాలు మరియు ప్యాలెస్ల వంటి కథలను చెప్పేవారు. ఇలా ఈ కథలు వింటున్న సమయంలో ప్రపంచాన్ని మరిచపోయే విధంగా ఉంటాయి. ఈ ఆడియోబుక్లో.. సుధా మూర్తి రచించిన కథలు కూడా అదే కోవలో వస్తాయి. వాటి కోసం ఈ లింక్ పై https://www.audible.in/ క్లిక్ చేయండి.
4. ఉల్లిపాయ కోసినప్పుడు ఎందుకు ఏడుపు వస్తుంది..? రచించిన వారు సుధామూర్తి. నేహా కరెన్, సాగరిక షజ్నీన్, షాలినీ విక్రాంత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మీ అమ్మ ఉల్లిపాయ కోసినప్పుడు కళ్ల నుంచి ఎందుకు నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది! సుధా మూర్తి ఉల్లిపాయలో పొరలు కలిగి ఉన్న కథను.. ఆ ఉల్లిపాయను కోస్తున్న సమయంలో మనం ఎందుకు ఏడుస్తాము..? అనే విషయాలను ఈ ఆడిబుల్ కథల రూపంలో చక్కగా వర్ణించారు. ఈ కథలు పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. వీటి కోసం ఈ లింక్ పై https://www.audible.in/ క్లిక్ చేయండి.