ఆపిల్ లాంటి పెద్ద కంపెనీ తన ఉద్యోగులందరినీ ఆఫీస్‌కి పిలిచిన తర్వాత ఇప్పుడు ఇండియాలోని మరికొన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు పిలవాలని నిర్ణయించుకోనున్నాయి. ఏ కంపెనీలు ఆఫీసు నుండి పని ప్రారంభించాలని నిర్ణయించుకోబోతున్నాయి.. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. (ప్రతీకాత్మక చిత్రం)
RPG గ్రూప్
ఇటీవల RPG గ్రూప్ ప్రెసిడెంట్ హర్ష్ గోయెంకా లింక్డ్ఇన్లో కొన్ని విషయాలను పంచుకున్నారు. ఇంటి నుండి పని చేయడం ఇకపై ఆచరణీయమైన దీర్ఘకాలిక ఎంపిక కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం.. RPG గ్రూప్ తన ఉద్యోగులలో సగం మందిని హైబ్రిడ్ మోడ్‌లో పని చేయడానికి అనుమతిస్తుంది. అందువల్ల.. RPG గ్రూప్ ఉద్యోగులు కనీసం హైబ్రిడ్ మోడల్లో పని చేయడం కొనసాగించడం అవసరం అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
విప్రో..
కోవిడ్ మహమ్మారి కారణంగా విప్రో ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కలిగించారు. అయితే వర్క్ ఫ్రం హోం వదిలి ఆఫీస్ రావాలని తాము ఒత్తిడికి గురి చేయడం లేదని.. కానీ ఎప్పటికైనా ఆఫీస్ లకు రాక తప్పదని.. త్వరలోనే పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్ కొనసాగిస్తామని ప్రెసిడెంట్ మరియు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) సౌరభ్ గోవిల్ అన్నారు.