ఈ జాబ్ మేళాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికి వయో పరిమితి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఆసక్తి గల అభ్యరుథలు తమ విద్యార్హతల ధృవ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ప్రతులతో పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో నేరుగా హాజరు కావాలని కలెక్టర్ అభ్యర్థులకు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక ఈ నెల 23న మంచిర్యాల జిల్లాలో ఉద్యోగ మేళా ఉండనున్నట్లు కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఎంఈసీ, మాథ్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో టెక మీ ప్రొగ్రామ్ కొరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ మేళా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్ మెమో, ఇంటర్, ఆధార్ , పాస్ ఫొటో, స్టార్ట్ ఫోన్ తో హాజరవ్వాలని తెలిపారు. అభ్యర్థుల యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయన్నారు. దీనికి సంబంధించి ఏమైన వివరాలను తెలుసుకోవాలనుకుంటే హెచ్ సీఎల్ ఏరియా ప్రతినిధిని సంప్రదించాలని సూచించారు. దాని కోసం 7569177071 నంబర్ కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)