అయితే ఈ వారంలోగా ఈ పరీక్షలకు సంబంధించి తుది కీతో పాటు.. ఫలితాలను కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అర్హత మార్కుల్లో.. అన్ని కేటగిరీ(All Category) అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో(Prelims Exam) 60 మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తమకు మార్కులు కలిసే అవకాశం ఉందని.. వాటిని పరిగణలోకి తీసుకొని ఫలితాలను కూడా త్వరగా ప్రకటించాలని అభ్యర్థులు కోరారు. అయితే ఈ వారంలోగానే అంటే అక్టోబర్ 24లోపు ఫలితాలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ లో ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించిన నియామక బోర్డు కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి జాప్యంతో .. దీనిని నవంబర్ లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)