HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
THE WORK FROM HOME SCENARIO TAKES A TOLL ON THE MENTAL HEALTH OF INDIAN PROFESSIONALS FINDS A LINKEDIN SURVEY NK
Work from Home: వామ్మో... వర్క్ ఫ్రమ్ హోమ్... సర్వేలో భయంకర విషయాలు
Work from Home in India: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఇండియాలో కోట్ల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దాని వల్ల కలిగే సైట్ ఎఫెక్టులు ఇప్పుడు బయటపడుతున్నాయా? సర్వేలో ఏం తేలింది?
News18 Telugu | October 10, 2020, 1:27 PM IST
1/ 7
Work from Home on Covid 19 Time: ఈ కరోనా కాలంలో... ఇంట్లోనే ఉండి... "వర్క్ ఫ్రమ్ హోమ్" చేసుకునేవాళ్ల పని హాయి... ఏ బాధా ఉండదు. జర్నీ గోలే ఉండదు. ఇంట్లో సాఫీగా సోఫాలో కూర్చొని... ఒళ్లో ల్యాప్టాప్ పెట్టుకొని... పక్కన స్నాక్స్, కూల్ డ్రింక్స్ పెట్టుకొని... హాయిగా పనిచేసుకుంటారని అని మనం అనుకుంటే... అది పొరపాటే అంటోంది లింక్డ్-ఇన్ సంస్థ. ఇండియాలో వర్కింగ్ ప్రొఫెషనల్స్... వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తున్నారు? అది వాళ్లకు ఎలాంటి ఫీల్ కలిగిస్తోంది? ఆనందంగా చేస్తున్నారా? మానసికంగా (మెంటల్ గా) అంతా బాగుందా? అనే అంశాలపై లింక్డ్ ఇన్ ఈ సర్వే చేసింది. మరి ఇందులో ఎలాంటి ఫలితాలు వచ్చాయో... ఇంటి నుంచి పనిచేయడంపై సో కాల్డ్ ప్రొఫెషనల్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం. (credit - LinkedIn)
2/ 7
వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా... విడిగా ఉంటూ పనిచేయడాన్ని... ఏదో ఒక సందర్భంలో ఒంటరితనంగా ఫీలవుతున్నట్లు 60 శాతం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ తెలిపారు ఈ సర్వేలో. నిజమేమరి... ఆఫీసులో అయితే... తోటి ఉద్యోగులతో మధ్యమధ్యలో మాట్లాడొచ్చు... సరదాగా ఓ జోక్ వేసుకోవచ్చు. లేదా అలా బయటకు వెళ్లి చాయ్ బిస్కెట్ తీసుకోవచ్చు. ఇప్పుడవేవీ లేవు కదా... ఒంటరితనం అనిపించదా మరి. (credit - LinkedIn)
3/ 7
36 శాతం మంది ప్రొఫెషనల్స్... తాము సరిగా పనిచేయలేకపోతున్నామని తెలిపారు. ఎంతైనా మనం మనుషులం కదా... మనకు ఇతరులతో కలిసి జీవించడమే ఇష్టంగా ఉంటుంది. ఒంటరిగా ఓ చోట కూర్చొని... టిక్కూ టిక్కూ మని కీబోర్డుపై కీలను ప్రెస్ చేస్తే... ఒంటరితనం ఆవహించడం సహజమే మరి. (credit - LinkedIn)
4/ 7
28 శాతం మంది వర్కింగ్ మదర్స్... తాము ఇప్పుడు తమ పిల్లలకు... రోజంతా రక్షణ కల్పించగలుగుతున్నట్లు తెలిపారు. ఇదివరకు ఆఫీసుకు వెళ్తే... తమ పిల్లల్ని ఎవరు చూస్తారో, పిల్లలేమైనా కంట్రోల్ తప్పుతారేమో అని తల్లులకు టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ పనిచేస్తున్నారు కాబట్టి... పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడానికి వీలవుతోందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇదో బెనెఫిట్ ఉందన్నమాట. (credit - LinkedIn)
5/ 7
17 శాతం వర్కింగ్ ఫాదర్స్... తాము తమ పిల్లలకు ఫుల్ టైమ్ చైల్డ్ కేర్ కల్పించగలుగుతున్నామని తెలిపారు. ఇదివరకు ఈ తండ్రులంతా... ఆఫీసులకు వెళ్లిపోయి... తమ పిల్లలతో టైమ్ గడపలేకపోయేవారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో... ఇంట్లోనే పిల్లలతో ఉంటూ... వాళ్లను చక్కగా చూసుకుంటున్నారన్నమాట. (credit - LinkedIn)
6/ 7
40 శాతం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తెలిపారు. ప్రొఫెషనల్ జాబ్స్ కాబట్టి... వారికి డబ్బు కొరత ఉండదని అనుకోవడానికి లేదు. వాళ్లకు వచ్చే శాలరీలకు తగ్గట్టే... వాళ్ల ఖర్చులూ ఉంటున్నాయి. వాటికి అదనంగా రకరకాల EMIలు, క్రెడిట్ కార్డ్ పేమెంట్లు కామన్. అందువల్ల వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారనుకోవచ్చు. (credit - LinkedIn)
7/ 7
39 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్.. తమకు ఒత్తిడి, టెన్షన్ వంటివి పెరిగాయంటున్నారు. ఇంటిపట్టునే ఉంటూ... పని చేసుకుంటే... టెన్షన్ ఎందుకు పెరుగుతుంది అనే డౌట్ మనకు రావచ్చు. ఆఫీసులో అయితే... ఏదైనా పని సమస్య వస్తే... తోటి కొలీగ్స్ ఓ చెయ్యి వేస్తారు. అలా అందరూ కలిసి స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తారు. ఇంటిదగ్గర అలా కాదు. ఎవరి పని వాళ్లదే. మధ్యలో చిట్చాట్లు, కాలక్షేప కబుర్లు ఉండవు. ఎప్పుడూ పని పని పని... అందుకే... ఒకరకమైన ఒత్తిడి, టెన్షన్ ఉంటున్నట్లు ఫీలవుతున్నారు ప్రొఫెషనల్స్. (credit - LinkedIn)